ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ కీలక పురోగతి సాధించింది. మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడు, ఆయనకు అత్యంత సన్నిహితుడు వైఎస్ అనిల్ రెడ్డి వద్ద పీఏగా విధులు నిర్వహిస్తున్న దేవరాజులను ఉన్నతాధికారులు శుక్రవారం సిట్ కార్యాలయానికి పిలిపించారు. మద్యం కుంభకోణం వ్యవహారంలో పలువురి పాత్రపై ఆయనకు ప్రశ్నలు సంధించి.. అతని నుంచి జవాబులు రాబడుతున్నట్లు తెలుస్తోంది.