అప్పు చెల్లించలేదని కత్తితో దాడి (వీడియో)

AP: ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన జరిగింది. తీసుకున్న డబ్బులు చెల్లించడం లేదంటూ యాసీన్ అనే వ్యక్తి మరో వ్యక్తిపై కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. యాసీన్ తన భార్య పేరుతో తీసుకున్న లోన్ లో కొంత డబ్బు బాధితుడికి అప్పుగా ఇచ్చాడు. డబ్బులు తిరిగి అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో యాసీన్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్