టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి (వీడియో)

AP: టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. కొలికపూడి, ఎంపీ కేశినేని చిన్ని మధ్య పంచాయితీపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ వర్ల రామయ్య విచారించనున్నారు. కొలికపూడి, కేశినేని చిన్నిపై చర్యలకు అధిష్టానం సిద్ధమైంది. సాయంత్రం 4 గంటలకు ఎంపీ కేశినేని చిన్ని కమిటీ ముందు హాజరుకానున్నారు. కాగా, గత కొంతకాలంగా కొలికపూడి, కేశినేని చిన్ని పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్