మొoథా తుఫాన్ వలన నష్టపోయిన వారికి తాత్కాలిక ఉపశమనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం, నిత్యవసర వస్తువులను రానున్న మూడు రోజులలో పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అమలాపురంలోని కలెక్టరేట్ లో జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి, మొoథా తుఫాన్ ఉపశమన చర్యలు, పంట నష్ట అంచనాల రూపకల్పనపై సమీక్షించారు.