అమలాపురం: అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్దం

అమలాపురం రూరల్ పరిధిలోని బండారులంకలో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. వల్లూరివారి పేటలో ఉప్పుగంటి దత్తాత్రేయుడు అనే వ్యక్తికి చెందిన తాటాకిల్లు విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో లంకారి నాగబాబుకు చెందిన రేకుల షెడ్డు పాక్షికంగా దెబ్బతింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సుమారు రూ. 3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపాడు.

సంబంధిత పోస్ట్