అంబాజీపేటకు చెందిన కొబ్బరికాయల వ్యాపారి, వాసవీ వైశ్యసంఘం అధ్యక్షుడు కాసు శ్రీనివాస రావు (60) గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ నెల 3న తన పొలం వద్ద గడ్డిమందు తాగిన ఆయన, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయాన్ని వెల్లడించారు. కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.