డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని వాకలగరువు పుష్కరాల రేవులో మంగళవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడు నలుపు రంగు ప్యాంటు, తెలుపు రంగు బనియన్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి మణికట్టుపై లక్ష్మీదేవి బొమ్మతో ఉన్న ఎర్రటి తాడు కట్టి ఉందని పోలీసులు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.