ఆలమూరు: గోదావరిలో మృతదేహం లభ్యం

మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన సురేష్ కుమార్ అనే యువకుడు ఆరు రోజుల క్రితం రాజమండ్రిలోని పుష్కరఘాట్ వద్ద స్నానానికి దిగి గోదావరిలో గల్లంతయ్యాడు. పోలీసులు, బంధువులు గాలించినా ఆచూకీ లభించలేదు. శనివారం కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని ఆలమూరు వద్ద గోదావరిలో మృతదేహం ఉందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లి, మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడిని సురేష్ కుమార్ గా గుర్తించి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరేష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్