కొత్తపేట మండలం కొత్తపేటలో మంగళవారం కొంతమంది యువకులు మద్యం మత్తులో బీసీ సంఘ నాయకుడు మట్టపర్తి సూర్యచంద్రరావు ఇంటిపై దాడి చేసి, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ఇంట్లో ఉన్న మహిళలు భయభ్రాంతులకు గురయ్యారు. సూర్యచంద్రరావు కోడలు మట్టపర్తి దేవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేంద్ర తెలిపారు.