కోనసీమ జిల్లా, ఐ. పోలవరం మండలంలో 10 ఏళ్ల బాలికపై ఒక వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. శుక్రవారం వెలుగు చూసిన ఈ ఘటనలో, నిందితుడు బాలికను బంగ్లాలోకి తీసుకెళ్లి అఘాయిత్యం చేసినట్లు తెలుస్తోంది. బాలిక తల్లి, బంధువులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో, పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తునిలో ఇటీవల జరిగిన ఘటన మరువకముందే ఇలాంటి ఘోరం జరగడం కలకలం రేపుతోంది.