మానవత్వానికి, కుటుంబ బంధానికి అద్దం పట్టే ఘటన ముమ్మిడివరం(M) చెయ్యే రుగున్నేపల్లిలో జరిగింది. మగ దిక్కులేని తన కుటుంబానికి అన్నీతానై నిలబడిన ఓ కోడలు, తన అత్త ఆకస్మిక మృతితో దుఃఖాన్ని దిగమింగుకుని, తలకొరివి పెట్టి ఆదర్శంగా నిలిచింది. చెయ్యే రుగున్నేపల్లికి చెందిన పాపిరెడ్డి ఆదిలక్ష్మి భర్త కొంతకాలం క్రితం మృతి చెందారు. దురదృష్టవశాత్తూ ఆమె కుమారుడు కూడా మరణించడంతో ఆమె కోడలు అత్తకు తలకొరివి పెట్టింది.