పిఠాపురం: హోరాహోరీగా సాగిన ఆర్చరీ పోటీలు

పిఠాపురంలోని క్రీడా మైదానంలో జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 85 మంది హాజరవగా శుక్రవారం వీరికి పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన 30 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గోపాలకృష్ణ, పి. లక్ష్మణరావు తెలిపారు. వీరంతా విజయవాడలో డిసెంబరు 3 నుంచి జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్