రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలోని ద్రాక్షారామలో శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం మాణిక్యాంబ అమ్మవారు శ్రీ మహా చండీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.