కూన రవి మానసికంగా.. శారీరకంగా వేధించాడు: ప్రిన్సిపాల్ సౌమ్య

AP: టీడీపీ ఎమ్మెల్యే కూన రవి కుమార్ తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని కేజీబీవీ ప్రిన్సిపాల్ రెజిటీ సౌమ్య తెలిపారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కూన రవి వేధింపులకు సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే వేధింపులపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వయిరీ చేయించాలని సౌమ్య డిమాండ్ చేశారు. 2013 నుంచి ప్రిన్సిపాల్ గా తాను పనిచేస్తున్నానని ఇంతవరకు తనపై ఎలాంటి రిమార్క్ లేదన్నారు. రెండు నెలులుగా వేధింపులకు గురవుతున్నానని వాపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్