AP: శ్రీకాళహస్తి జనసేన ఇన్‌ఛార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడు సెల్ఫీ వీడియోపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ తొలిసారిగా స్పందించారు. రాయుడి వీడియో చూశానని, చంపేసే ముందు కోట వినుత బెదిరించి అలా చేయించి ఉండొచ్చని అన్నారు. అది ఏఐ వీడియో అని తెలిపారు. వినుత దంపతులు బెయిల్‌పై వచ్చిన తర్వాతే వీడియో రిలీజ్ అవ్వడంపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. వినుత దంపతులే రాయుడుని చంపేశారని గతంలో పోలీసులు చెప్పారని గుర్తు చేశారు. తనపై కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే ఆరోపించారు.