ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆదివారం ఉదయం 8 గంటలకు 5.80 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో ఘంటసాల మండలం శ్రీకాకుళం కృష్ణానదిరేవుకు భారీగా నీరు చేరింది. ఘంటసాల తాసిల్దార్ విజయప్రసాద్ రెవిన్యూ సిబ్బందిని అప్రమత్తం చేసి, వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.