మోపిదేవి: పంట పొలాల్లోకి చొచ్చుకు వచ్చిన వరదనీరు

కృష్ణా నదికి వరద ఉధృతి పెరగడంతో మోపిదేవి మండలంలోని కే. కొత్తపాలెం, బొబ్బర్లంక గ్రామాల పంట పొలాలు ఆదివారం సాయంత్రం ముంపునకు గురయ్యాయి. కే. కొత్తపాలెం దళితవాడలోకి వరద నీరు చొచ్చుకురావడంతో పలు ఇళ్లలోకి నీరు చేరింది. పసుపు, కంద వంటి వాణిజ్య పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్