కృష్ణా మిల్క్ యూనియన్‌లో జరుగుతున్న అక్రమాలపై తక్షణమే విచారణ జరిపి, దోషులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా శనివారం ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. విజయ డెయిరీ మ్యాక్స్ చట్టం ప్రకారం పలు డివిజన్లుగా పనిచేస్తుందని, కృష్ణా జిల్లాలో కృష్ణా మిల్క్ యూనియన్ సహకార రంగంలో ఉందని ఆయన వివరించారు.