కొండపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం

కొండపల్లి మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావును గురువారం మెప్మా సభ్యులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాల సభ్యులకు అభినందనలు తెలిపారు. మెప్మా సిబ్బంది, ఆర్పీలకు సహకరిస్తూ, సమస్యలను తక్షణం పరిష్కరిస్తానని, తన సాయశక్తులా అందరికీ తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్