మైలవరం: రోడ్డు ప్రమాదంలో జేసీబీ ఆపరేటర్ దుర్మరణం

మైలవరం శివారులోని 30వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న మొర్సుమల్లికి చెందిన సాయి (27) మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైలవరంలో జేసీబీ పని పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా, మినీ ట్రక్కు బైక్‌ను ఢీకొట్టినట్టు తెలుస్తోంది. 6 ఏళ్ల క్రితమే సాయికి వివాహం అయింది. మృతుడి తండ్రి వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్