ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం రుద్రవరం గ్రామంలో అరుదైన దృశ్యం చూసేవారిని కనువిందు చేసింది. గ్రామ ప్రజలు వివరాల మేరకు, కొన్ని రోజుల నుండి వేప చెట్టుకు తెల్లటి పాల లాంటి ద్రవం కారుతోందన్నారు. దీంతో ఆ దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు తరలివస్తున్నారని వివరించారు. అమ్మవారు వెలసిందా అని కొంతమంది అంటున్నారు. కాగా ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.