మైలవరం నియోజకవర్గం లోని కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. అధికారులు ఫలితాన్ని నిర్ధారించారు. మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సభ్యుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఇరు పక్షాల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో సీల్డ్ కవర్ ను తెరిచారు. కోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్లో ఉన్న ప్రకారం ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గా చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నుకున్నట్లు తెలిపారు.