అవనిగడ్డలో శుక్రవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారింది. దట్టమైన మేఘాలు అలుముకుని చల్లపల్లి, నాగాయలంక, ఘంటసాల మోపిదేవి, అవనిగడ్డ మండలాల్లో వర్షం కురిసింది. దీంతో వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. అవనిగడ్డ మండలంలోని పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు.