ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వస్తే మా ప్రాంతం బాగుపడుతుంది మా రైతుల సమస్యలు పరిష్కరించి మమ్ములను ఆదుకుంటాడని కొండంత ఆశతో ఎదురుచూసిన కోడూరు మండలం రైతుల ఆశ అడి ఆశ అయినట్ల అయ్యిందని గురువారం మహిళలు వాపోయారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు రోడ్డు పక్కన ఉన్న వరి పొలాలను చూపించి మా సమస్యల గురించి పట్టించుకోరా అని మహిళా రైతులు సైతం ఆవేదన వ్యక్తం చేశారు.