కోడూరు మండలంలోని హంసలదీవి గ్రామంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పుణ్య స్నానాలకు భక్తుల రద్దీ ఆశించిన స్థాయిలో కనిపించలేదు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని భావించినప్పటికీ, అందుకు తగ్గట్టుగా రద్దీ నమోదు కాలేదు. బుధవారం ఉదయం పోలీస్ శాఖ సముద్ర తీరం వద్ద బందోబస్తును పటిష్టంగా నిర్వహించింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరైన్ పోలీసులు నిరంతరం పర్యవేక్షించారు.