కోడూరు: విమర్శలు చేసిన వారి నాయకుడు ఇక్కడకు రాలేదు

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంగళవారం కోడూరు ఎంపీడీఓ కార్యాలయంలో మొంథా తుఫాన్ అనంతర పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు కరకట్ట మీదుగా పులిగడ్డ వరకు వచ్చి రైతుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారని, అయితే విమర్శలు చేసిన వాళ్ళ నాయకుడు ఇక్కడకు రాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్