కోడూరు సంత మార్కెట్ సమీపంలోని కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోకి చొరబడి హండీలోని నగదును దొంగిలించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తోట చంద్రశేఖర్, బడే రాంబాబు తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోడూరు ఎస్సై చాణక్య సీసీ కెమెరా పుటేజీని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30న ఈ సంఘటన జరిగినట్లు సమాచారం.