శనివారం, ముఖ్యమంత్రి కార్యాలయంలో, మండల పశుసంవర్థక వైద్యశాల వైద్యురాలు సిహెచ్. సాయి మౌనిక, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మొంథా తుఫాను పోరాట యోధ అవార్డును అందుకున్నారు. మొంథా తుఫాను సమయంలో, మండలంలోని సంగమేశ్వరం శివారు పాత ఉపకాలిలో ఇసుక దిబ్బలలో చిక్కుకుపోయిన నలుగురు గొర్రెల కాపరులను, 910 గొర్రెలను ప్రత్యేక పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించి కాపాడటంలో ఆమె కీలక పాత్ర పోషించారు.