బాపులపాడు: 'చంద్రబాబుతోనే సుస్థిర పాలన సాధ్యం'

ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సుస్థిర పాలన సాధ్యమని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం బాపులపాడు మండలం కానుమోలు, ఆరుగొలను గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాదికాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్