విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ అభివృద్ధి పనులు నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ పోర్టు, రెవెన్యూ, పంచాయత్ రాజ్, ఇరిగేషన్, డ్రైనేజీ తదితర శాఖల అధికారులతో పనుల పురోగతి, సమస్యలపై సమీక్షించారు.