గన్నవరం: జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు దగ్ధం

చెన్నై-కోల్ కత్తా జాతీయ రహదారిపై గురువారం ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్లే క్రమంలో గన్నవరం బస్టాండ్ సమీపంలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ రోడ్డుపై బస్సును నిలిపివేశాడు. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అన్నారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పి వేశారు.

సంబంధిత పోస్ట్