గుడివాడ అర్బన్ బ్యాంకుకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్సిపి రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం గుడివాడ సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిష్టాత్మకమైన బ్యాంకుకు కమిటీ లేకపోవడంతో అది వెలవెలబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిఎసిఎస్ లకు కమిటీలు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.