గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధాంతం రోడ్డులో ఉన్న గోడౌన్స్ వద్ద, బిల్లపాడుకు చెందిన ముఠాలో పనిచేసే పామర్తి దుర్గారావు గోడౌన్ లో పని ముగించుకొని నిద్రిస్తున్నాడు. ఏపీ 16 టియు 1349 నెంబర్ గల లారీ డ్రైవర్ రాంబాబు నిర్లక్ష్యంగా లారీని రివర్స్ చేస్తూ గోడ పక్కన నిద్రిస్తున్న దుర్గారావుపై లారీని ఎక్కించాడని ఎస్ఐ చంటిబాబు శనివారం రాత్రి తెలిపారు. ఈ ఘటనలో దుర్గారావు కాళ్లకు, కుడి భుజానికి తీవ్ర గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు.