గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో పి-ఫోర్ మార్గదర్శి మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో 45 మంది ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లకు తొలి బ్యాచ్ శిక్షణ తరగతులు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని పేదరికం నుండి బయటపడాలని శిక్షణార్థులకు పిలుపునిచ్చారు.