గుడివాడ ఏలూరు రోడ్డులోని ఫాదర్ బియాంకి పాఠశాల విద్యార్థులు మొబైల్ ఫోన్ దుర్వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు శుక్రవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల యంగ్ స్టూడెంట్ మూమెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు నినాదాలు చేస్తూ, మొబైల్‌ను సక్రమంగా వాడాలని, దానిపై ఆధారపడకుండా జాగ్రత్తపడాలని ప్రజలకు సందేశం ఇచ్చారు. ర్యాలీకి విద్యార్థులు ఉత్సాహంగా స్పందించారు.