నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ ను పూర్తి సాక్ష్యాధారాలతోనే అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కల్తీ మద్యంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి యత్నించారని ఆయన మండిపడ్డారు. జనార్దన్ రావు ఇంటికి వెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ ఉందని, నకిలీ మద్యంతో ప్రాణాలు తీసి ఇప్పుడు కులం ప్రస్తావన తేవడం దారుణమని కొల్లు రవీంద్ర అన్నారు. BCల గురించి మాట్లాడే అర్హత జోగికి లేదని ఆయన పేర్కొన్నారు.