మచిలీపట్నం: సముద్ర హారతికి పకడ్బందీగా ఏర్పాట్లు

కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సముద్ర హారతికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. ఈనెల 5వ తేదీన కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి మంగినపూడి బీచ్ ను సందర్శించి, అక్కడ జరుగుతున్న విద్యుత్ దీపాలు, బారికేడింగు ఏర్పాట్లను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్