మచిలీపట్నం: భక్తులతో మంగినపూడి బీచ్ కిట కిట

కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా మచిలీపట్నం మంగినపూడి బీచ్ భక్తులతో కిటకిటలాడింది. వేలాది మంది భక్తులు పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించడానికి, సముద్రంలో కార్తీక దీపాలు వదలడానికి తరలివచ్చారు. సుమారు లక్ష మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేయడంతో, అధికారులు అందుకు తగ్గట్లు విస్తృత ఏర్పాట్లు చేశారు. కంట్రోల్ రూమ్ ద్వారా ఈ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్