మంగళవారం రాత్రి మచిలీపట్నంలో మాజీ సీఎం జగన్ కోసం ప్రజలు చీకట్లో బారులు తీరారు. తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులకు అండగా నిలిచిన తర్వాత జగన్ మచిలీపట్నం చేరుకున్నారు. ఆలస్యమైనప్పటికీ, మహిళలు, అభిమానులు జననేత కోసం చీకట్లోనే ఎదురుచూసి, హారతులతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. అందరికీ అభివాదం చేస్తూ ఆయన తన పర్యటనను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని కూడా పాల్గొన్నారు.