కార్తీక పౌర్ణమి సందర్భంగా నదిలోనూ, సముద్రంలోనూ స్నానాలు ఆచరిస్తే పుణ్యఫలం లభిస్తుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వద్ద స్నానాలు ఆచరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంగినపూడి బీచ్ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.