అవినీతి ఆరోపణల నేపథ్యంలో బుధవారం ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలోకి బయటి వ్యక్తులను అనుమతించకుండా గేట్లు మూసివేసి సోదాలు నిర్వహించారు. అయితే, ఏసీబీ అధికారులు మాత్రం వీటిని సాధారణ తనిఖీల్లో భాగమని, తమ పరిధిలోని కార్యాలయాలను తనిఖీ చేస్తున్నామని వెల్లడించారు.