జి. కొండూరు: జోగి రమేష్ అక్రమ అరెస్టును ఖండించిన: ఎంపీపీ

మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్టును ఖండిస్తూ వైసీపీ నేతలు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. జి కొండూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ మాట్లాడుతూ, టీడీపీ నాయకులు చేస్తున్న అక్రమ కల్తీ మద్యం వ్యాపారాలను జోగి రమేష్ మీడియా ద్వారా ప్రశ్నించారని, ఈ విషయంపై మాట్లాడడం సహించలేని ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వము కూడా కక్ష సాధింపు చర్యలు మానుకొని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ఆమె హితోపదేశం చేశారు.

సంబంధిత పోస్ట్