మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు, నారా లోకేష్‌లను ప్రశ్నించినందుకు తనపై దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటానని, ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం ఫ్యాక్టరీని బయటపెట్టానని తెలిపారు. తాను ఏ తప్పు చేయలేదని దుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేశానని, బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చట్టాన్ని, వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు.