ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి ఐఓసీ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఉన్న గుంతలను తప్పించబోయి ద్విచక్రవాహనంపై వెళ్తున్న సాంబశివరావు కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. రోడ్లపై గుంతలు పూడ్చకపోవడం వల్లే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.