నకిలీ మద్యం కేసులో ఎలాంటి సంబంధం లేని జోగి రమేష్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని వైసీపీ అధికార ప్రతినిధి బుర్రి ప్రతాప్ ఆరోపించారు. ఆదివారం మైలవరంలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఆధారాలు లేకుండా జోగి రమేష్‌ను ఎక్కువ రోజులు జైల్లో ఉంచలేరని, చివరికి న్యాయమే గెలుస్తుందని ఆయన అన్నారు.