మైలవరం: పేదల సామాజిక భద్రత, ఆర్థిక భరోసాకు పింఛన్లు పంపిణీ.

మైలవరంలో శనివారం పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా పింఛన్లను పెంచి అందిస్తున్నామని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత, నేత కార్మికులతో పాటు వెనుకబడిన వర్గాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని, ప్రతి నెలా రూ. 4వేల నుంచి రూ. 15వేల వరకు పింఛన్ల రూపంలో ఆర్థిక సహాయం అందుతుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్