పెదపారుపూడి మండలం అప్పికట్ల, దోసపాడులలో అనారోగ్యంతో బాధపడుతున్న లబ్ధిదారులకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ప్రభుత్వం చికిత్స బిల్లులను చెల్లిస్తుందని, ప్రజల సంక్షేమానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి చెక్కులు అందించినట్లు ఆయన పేర్కొన్నారు.