గుడివాడ-బంటుమిల్లి ప్రధాన రహదారిలోని పెదతుమ్మిడి వద్ద ఆవుల సంచారం వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. నిత్యం భారీగా వాహనాలు తిరిగే ఈ రోడ్డుపై ఆవులు అడ్డంగా నిలబడటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆదివారం విజ్ఞప్తి చేశారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఆవులు రోడ్డుపైనే ఉంటున్నాయి.