పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ బుధవారం గూడూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ రైతును రాజును చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని, రైతులు తమ పంటను ప్రభుత్వానికే అమ్మాలని సూచించారు.