పెడన ఎమ్మెల్యే కాగిత బుధవారం గూడూరులో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. రామరాజుపాలెంలో జగన్ మాట్లాడిన వ్యక్తి రైతు కాదని, సెంటు భూమి కూడా లేని వ్యక్తిని నష్టపోయిన రైతుగా చూపించడం సిగ్గుచేటు అని ఆయన తీవ్రంగా విమర్శించారు.